Saturday 8 February 2014

JOY OF GIVING( పంచు కోవడంలోని ఆనందం)

            కడుపు నింపుకోవడానికి చాలా ఆహారం కావాలి.కాని నలుగురితో పంచుకుని తింటే కడుపు నిండినట్లు అనిపిస్తుంది.అందుకే మన ఇంట్లో అమ్మ అందరికి ఆహారం పెట్టి చివరగా మిగిలింది తను తింటుంది.పంచు కోవడం లో ఉన్న ఆనందాన్ని,ఈ మానవతా సూత్రాన్ని JOYOFGIVINGWEEK ప్రచారం చేస్తుంది.
         ఇవ్వడం అన్నది అన్ని సార్లు డబ్బు తో ముడిపడనక్కర్లేదు.మనకున్న నైపుణ్యం ,చిరునవ్వు ఓ చికిత్స,ఓ బొమ్మ గీసి ఇవ్వటం,ఓ కచేరీ,ఓ పూట భోజనం,మూలన పడున్నపాదరక్షలు,మిగిలిన అన్నం వాడి పడేసిన బట్టలు
పుస్తకాలు ఏవైయినా కావచ్చు.ఏమి ఇస్తున్నాం అన్నది కాకుండా ఎంత ప్రేమగా ఇస్తున్నాం,అసలు ఇస్తున్నామా లేదా అన్నది ప్రధానం.ఇవ్వడం లోని ఆనందాన్ని, పంచుకోవడం లోని గొప్పదనాన్ని అందరికి చాటాలన్నదే జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ లక్ష్యం.అక్టోబర్ 2 నుండి 8 వరకు ఈ వారాన్ని జరుపుకోవాలని Give india foundation పిలుపు నిస్తోంది.మనం ఇచ్చేది ఏ మూలకు సరిపోకవచ్చు.ఇవ్వడం అన్న భావనగొప్పది.ఇవ్వడం లో ఉన్న ఆనందం గొప్పది.దాన్ని జీవితంలో భాగం చేయాలన్నదే మా ఉద్దేశం అంటారు Give india రూప కర్త వెంకట కృష్ణన్.ఈయన ఐఐఎంలో MBA  చేసారు గత ఏడాది Giveindia తరపున 50,000 దాతల ద్వారా 18. కోట్లు సేకరించారు. ఆయన ఈ సంస్థను తన ఖర్చులకు కూడా అందులో ఒక్క పైసా తీసుకోకుండా నిర్వహిస్తున్నారు కృష్ణన్ .
            ఈ వీక్ లో అందుకునే వారి కళ్ళల్లో ఆనందపు వెలుగులు,అందించే కళ్ళల్లో ఎనలేని సంతృప్తి. ప్రేమ్ జీ ,సచిన్,ద్రావిడ్,శ్రియ,ఫరాఖాన్ ,గోపీచంద్,నాగార్జున,వెంకటేష్ సిద్ధార్ద్ ,విష్ణు,మనోజ్ సైనా ప్రచార రాయబారులుగా వ్యవహరిస్తున్నారు.సూర్య తన పారితోషకంలో 10% ఈ వీక్ లో ఖర్చు చేస్తున్నాడు.కిమ్స్ ,అప్పొలో హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తాయి.రహమాన్ joyofgiving గీతానికి రాగాలు కట్టాడు.మణిరత్నం ఓ డాక్యు మెంటరీ తీస్తానన్నాడు.ISB HYD  విద్యార్థులు పాల్గొంటున్నారు.దాతృత్వానికి హృదయమే కొలమమానం .  www.joyofgivingweek.org          
ఒకసారి పై వెబ్సైటు కెల్లి చూడండి.
 పంచుకోండిలా!
1)బట్టలు,పుస్తకాలు,భోజనం,ప్రేమ,అనుభూతులు,గౌరవం పంచండి .
2)కాలనీలో పార్కును శుభ్రం చేయండి .
3)పాదచారులకు లిఫ్ట్ ఇవ్వండి
4)సమస్యల్లో ఉన్న మిత్రునికి ఓ మంచి పుస్తకం ఇచ్చి ధైర్యం చెప్పండి .
5)joyofgiving  గొప్పదనాన్ని వివరిస్తూ మిత్రులకు మెయిల్స్ పంపండి .
6)దూరమైన మిత్రులను దగ్గరికి తీసుకోండి
7)పొగరాని పొయ్యి రూ 200 అవుతుంది.పల్లెల్లో పాత రకం పొయ్యి వాడుతున్న ఓ 5 గురికి వాటిని ఇవ్వండి .
8)మారుమూల పల్లెల్లోని పాటశాలకు వెళ్లి మీ laptap తో పాటాలు చెప్పండి
9)ఓ కాబ్ మాట్లాడుకుని నలుగురు మురికి వాడల పిల్లల్ని ఊరంతా తిప్పండి కార్లో తిరుగుతామని వారు కలలో సైతం ఊహించరు.
10)అమ్మ,నాన్నలను వారి చిన్నప్పటి సంగతులను అడగండి
11)మీ వీధిని ఊడ్చే మున్సిపల్ సిబ్బంది ని ఎంత బాగా శుభ్రం చేస్తున్నారో నని మెచ్చుకోండి . జీవితం లో అదే తొలి ప్రశంస కావచ్చు .
        ఆలోచిస్తే ఇలాంటి idea లు బోలెడన్ని . వాటిల్లో కొన్నిటినయినా అమలు చేయండి .Friendsfoundation   కోరుతోంది ఇదే.
(ఈ వ్యాసం ఈనాడు ఆదివారం అనుబంధం లోనిది )

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. పొగరాని పొయ్యి ఎక్కడ దొరుకుతుందొ చెప్పగలరా? Plz send details to my mail: naiknagaraju@gmail.com

    ReplyDelete