Friday 21 February 2014

S.C హాస్టల్ లో చదువు యొక్క విలువ పై సదస్సు

              Friendsfoundation ఆధ్వర్యంలో మరొక హాస్టల్ నందు  చదువు యొక్క విలువ పై అవగాహనా సదస్సు   జరిగింది.ఈ హాస్టల్ మార్కాపుర్ లోని  తర్లుపాడు రోడ్ నందు గల మున్సిపల్ పార్క్ కు దగ్గరలో ఉంది.దీనికి వార్డెన్ గా యోగిరామ్ గారు ఉన్నారు.వారి అనుమతితో ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.
          మానవ పరిణామ క్రమంలో మనిషి సాధించిన అద్బుత ఆవిష్కరణలను వివరిస్తూ మీరు కూడా ఏదో  సాదిం చటానికే ఈ భూమి పైకి వచ్చారని చెబుతూ బాగా  చదువుకుంటే వచ్చే ప్రయోజనాలు వివరిస్తూ భవిష్యత్ లో ఏయే ఉద్యోగాలకు ఏయే చదువులు చదవాలో వివరించటం జరిగింది.విద్యార్థులు ఎంతో ఆసక్తిగా విని ఇచ్చిన  సూచనలు వ్రాసుకున్నారు.మరల ఎప్పుడు వస్తారు అంటూ విద్యార్థులు,వార్డెన్ గారు అడగటం ఆనందం కలిగించింది.ఈ సారి వచ్చి అందరిని విడివిడిగా కలిసి వారి విద్యా ప్రగతిని తెలుసుకొని భవిష్యత్ సూచనలు తెలియజేస్తానని చెప్పాను.ఈ సదస్సునకు అనుమతి ఇచ్చిన వార్డెన్ యోగిరామ్ గారికి ధన్యవాదాలు. మీరు ఎప్పుడు వచ్చినా మీకు మా ఆహ్వానం ఉంటుందని  చెప్పారు.ఈ కార్యక్రమానికి మా అబ్బాయి స్నేహిత్,డిగ్రీ విద్యార్ధి లక్ష్మి నారాయణ సహకరించారు.
 రవిశేఖర్,వార్డెన్ యోగి రామ్ గారు



   

Sunday 16 February 2014

మానవత్వానికి ప్రతిరూపం

             ఆకలేస్తే పంచభక్ష్య పరమాన్నాలు తినే వాళ్ళు ఒక వైపు గంజి నీళ్ళతో సరి పెట్టుకునేవాళ్ళు ,పస్తులుండే వాళ్ళు మరికొందరు,లేదంటే అడుక్కునే వాళ్ళు ఇంకొందరు.
           మరి ఆకలిని తట్టుకోలేక అశుద్దాన్ని తినే వాళ్లుంటారా!స్విట్జర్లాండ్ లోని 5 నక్షత్రాల హోటల్ లోchef ఉద్యోగ మొచ్చిన ఓ యువకుడికి ఆ దృశ్యం కంట బడింది.అంతే ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఆకలికి అల్లాడిపోయే వారికోసం అక్షయ సంస్థను స్థాపించాడు.అతనే మదురై కి చెందిన నారాయనన్ కృష్ణన్.2010 సంవత్సరానికి ఆయన CNN HERO  AWARD పొందారు.ఇంట్లో  వద్దన్నా వినలేదు.తల్లిదండ్రులకు తను వారికి అన్నం పెడుతున్న ప్పుడు వారు ఆశీర్వదించే దృశ్యం చూపించాడు.వారి మనసు కరిగి ఒప్పుకున్నారు.ఆ అశుద్డాన్ని తినే వ్యక్తీ కృతజ్ఞతతో తన చేతిని పట్టుకున్నప్పుడు కలిగిన ఆనందం తన జీవితంలో ఎప్పుడు కలగలేదన్నాడు.
              మొదట్లో 30 మందికి 3 పూటలా తనే వండి తిండి పెట్టే వాడు ప్రస్తుతం అక్షయ సంస్థ 425 మందికి ప్రతి రోజు భోజనం పెడుతుంది.వారంతా నిరాదరణకు గురయిన వారు,అసహాయులు,మానసిక  వికలాంగులు. భోజనం పెట్టడంతో పాటు వారి ఒంటి శుభ్రత,ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకుంటారు. ప్రస్తుతం మదురై శివార్లలో మూడు న్నర ఎకరాల విస్తీర్ణంలో అక్షయ హోం నిర్మాణం జరుగుతుంది.వీరి చిత్త శుద్ధిని గమనించిన అమెరికాలోని ఉద్యో గులు అక్షయ USA సంస్థ ద్వారా విరాళాన్ని అందిస్తున్నాయి.వారందరినీ ఆ హోం లో చేర్చి సేవ లందించాలని కృష్ణన్ సంకల్పం.ఈ క్రింది website ను చూడండి
akshayatrust.org
ఫోన్ :09843319933

Saturday 8 February 2014

JOY OF GIVING( పంచు కోవడంలోని ఆనందం)

            కడుపు నింపుకోవడానికి చాలా ఆహారం కావాలి.కాని నలుగురితో పంచుకుని తింటే కడుపు నిండినట్లు అనిపిస్తుంది.అందుకే మన ఇంట్లో అమ్మ అందరికి ఆహారం పెట్టి చివరగా మిగిలింది తను తింటుంది.పంచు కోవడం లో ఉన్న ఆనందాన్ని,ఈ మానవతా సూత్రాన్ని JOYOFGIVINGWEEK ప్రచారం చేస్తుంది.
         ఇవ్వడం అన్నది అన్ని సార్లు డబ్బు తో ముడిపడనక్కర్లేదు.మనకున్న నైపుణ్యం ,చిరునవ్వు ఓ చికిత్స,ఓ బొమ్మ గీసి ఇవ్వటం,ఓ కచేరీ,ఓ పూట భోజనం,మూలన పడున్నపాదరక్షలు,మిగిలిన అన్నం వాడి పడేసిన బట్టలు
పుస్తకాలు ఏవైయినా కావచ్చు.ఏమి ఇస్తున్నాం అన్నది కాకుండా ఎంత ప్రేమగా ఇస్తున్నాం,అసలు ఇస్తున్నామా లేదా అన్నది ప్రధానం.ఇవ్వడం లోని ఆనందాన్ని, పంచుకోవడం లోని గొప్పదనాన్ని అందరికి చాటాలన్నదే జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ లక్ష్యం.అక్టోబర్ 2 నుండి 8 వరకు ఈ వారాన్ని జరుపుకోవాలని Give india foundation పిలుపు నిస్తోంది.మనం ఇచ్చేది ఏ మూలకు సరిపోకవచ్చు.ఇవ్వడం అన్న భావనగొప్పది.ఇవ్వడం లో ఉన్న ఆనందం గొప్పది.దాన్ని జీవితంలో భాగం చేయాలన్నదే మా ఉద్దేశం అంటారు Give india రూప కర్త వెంకట కృష్ణన్.ఈయన ఐఐఎంలో MBA  చేసారు గత ఏడాది Giveindia తరపున 50,000 దాతల ద్వారా 18. కోట్లు సేకరించారు. ఆయన ఈ సంస్థను తన ఖర్చులకు కూడా అందులో ఒక్క పైసా తీసుకోకుండా నిర్వహిస్తున్నారు కృష్ణన్ .
            ఈ వీక్ లో అందుకునే వారి కళ్ళల్లో ఆనందపు వెలుగులు,అందించే కళ్ళల్లో ఎనలేని సంతృప్తి. ప్రేమ్ జీ ,సచిన్,ద్రావిడ్,శ్రియ,ఫరాఖాన్ ,గోపీచంద్,నాగార్జున,వెంకటేష్ సిద్ధార్ద్ ,విష్ణు,మనోజ్ సైనా ప్రచార రాయబారులుగా వ్యవహరిస్తున్నారు.సూర్య తన పారితోషకంలో 10% ఈ వీక్ లో ఖర్చు చేస్తున్నాడు.కిమ్స్ ,అప్పొలో హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తాయి.రహమాన్ joyofgiving గీతానికి రాగాలు కట్టాడు.మణిరత్నం ఓ డాక్యు మెంటరీ తీస్తానన్నాడు.ISB HYD  విద్యార్థులు పాల్గొంటున్నారు.దాతృత్వానికి హృదయమే కొలమమానం .  www.joyofgivingweek.org          
ఒకసారి పై వెబ్సైటు కెల్లి చూడండి.
 పంచుకోండిలా!
1)బట్టలు,పుస్తకాలు,భోజనం,ప్రేమ,అనుభూతులు,గౌరవం పంచండి .
2)కాలనీలో పార్కును శుభ్రం చేయండి .
3)పాదచారులకు లిఫ్ట్ ఇవ్వండి
4)సమస్యల్లో ఉన్న మిత్రునికి ఓ మంచి పుస్తకం ఇచ్చి ధైర్యం చెప్పండి .
5)joyofgiving  గొప్పదనాన్ని వివరిస్తూ మిత్రులకు మెయిల్స్ పంపండి .
6)దూరమైన మిత్రులను దగ్గరికి తీసుకోండి
7)పొగరాని పొయ్యి రూ 200 అవుతుంది.పల్లెల్లో పాత రకం పొయ్యి వాడుతున్న ఓ 5 గురికి వాటిని ఇవ్వండి .
8)మారుమూల పల్లెల్లోని పాటశాలకు వెళ్లి మీ laptap తో పాటాలు చెప్పండి
9)ఓ కాబ్ మాట్లాడుకుని నలుగురు మురికి వాడల పిల్లల్ని ఊరంతా తిప్పండి కార్లో తిరుగుతామని వారు కలలో సైతం ఊహించరు.
10)అమ్మ,నాన్నలను వారి చిన్నప్పటి సంగతులను అడగండి
11)మీ వీధిని ఊడ్చే మున్సిపల్ సిబ్బంది ని ఎంత బాగా శుభ్రం చేస్తున్నారో నని మెచ్చుకోండి . జీవితం లో అదే తొలి ప్రశంస కావచ్చు .
        ఆలోచిస్తే ఇలాంటి idea లు బోలెడన్ని . వాటిల్లో కొన్నిటినయినా అమలు చేయండి .Friendsfoundation   కోరుతోంది ఇదే.
(ఈ వ్యాసం ఈనాడు ఆదివారం అనుబంధం లోనిది )

Saturday 1 February 2014

విద్యలో ప్రాధమిక అంశాల్లో మీ పిల్లల స్థితి ఎలా ఉంది?

                  తల్లి దండ్రులకు పిల్లల పై ఎన్నో ఆశలు ఉంటాయి.వారి భవిష్యత్తును గురించి ఎంతో ఊహించుకుంటారు. కానీ తమ పిల్లలకు చిన్న చిన్న అంశాలలో ఎంత పట్టు ఉందో తెలుసుకోరు.ప్రాధమిక విద్యలో "ప్రధం" అనే స్వచ్చంద సంస్థ సర్వే వివరాలు ఆశ్చర్యాన్నికలిగిస్తాయి.తరగతి వారీ ప్రమాణాల్లో పిల్లలు వెనుకబడి ఉన్నారని తెలియజేసింది.
         ఫ్రెండ్ ఫౌండేషన్ సంస్థ విద్యార్థులు తమ మాతృ భాష పై మరియు గణితం లోని నాలుగు ప్రక్రియలైన కూడిక తీసివేత,గుణకారం,భాగహారంల పై ఎంత పట్టు కలిగి ఉన్నారనే అంశం పై  దృష్టి పెట్టింది.చదువులో ప్రాధమిక విష యాలను బాగా నేర్పించాలని,అందుకు విద్యార్థులను,ఉపాధ్యాయులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో చిన్న పరీక్షను మా స్వగ్రామమైన సానికవరం primaryschool( gen) లో నిర్వహించగా 3,4,5 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు D.Basha గారు పరీక్ష నిర్వహించారు.తెలుగులో dictation,మరియు లెక్కలలో నాలుగు ప్రక్రియల పై జరిపారు. తరగతికి 5 గురు చొప్పున బాగా వ్రాసిన వారికి బహుమతులను january 26 సందర్భంగా మా అమ్మగారైన ఒద్దుల విజయలక్ష్మి గారితో అందించటం జరిగింది. విద్యార్థులు చాలా వరకు బాగా వ్రాసారు. బాషా గారు బాగా కృషి చేస్తున్నారు.
           మీరు కూడా మీ పిల్లలు చదివే schools  ప్రాధమిక అంశాలపై ఏ మేరకు దృష్టి పెడుతున్నాయో గమనించి వాటి పట్ల విద్యా సంస్థలు కృషి చేసే విధంగా సలహా ఇవ్వండి.ఈ  విషయం పై తల్లిదండ్రులు శ్రద్ధ తీసికొనగలరు.